జీవితంలో మనం కోల్పోయేది శూన్యం… కోల్పోవలసింది అజ్ఞానం

నమస్కారం. మనలో ఎక్కువ శాతం మంది,  రోజులో ఎక్కువ శాతంతో బ్రతికే ఎమోషన్ భయం. డబ్బు కోల్పోతామని కొందరు, బంధాలు కోల్పోతామని కొందరు, ఆరోగ్యం పోతుందని ఇంకొందరు. పరువు, మర్యాద, కీర్తి, పోతుందని మరికొందరు ఇలా భయపడుతూనే బండిని ముందుకు తీసుకెళ్తుంటారు.  అన్నట్టు ఈ మధ్య ఈ లిస్ట్ లోకి, సోషల్ మీడియాలో ఫాలోయర్స్‌ను,  లైక్స్‌ను కోల్పోతామని భయపడేవారు కూడా చేరారు. ఇన్ని చెప్తున్నా కానీ,  ఈ బ్లాగ్ మీకు నచ్చుతుందో లేదో అనే భయం నాక్కూడా ఉందనుకోండి.  సరే మనం చెప్పుకున్న భయాలన్నిటికి మూల కారణం మటుకు ఏదైనా కోల్పోతామనే భావన నుంచి వచ్చిందే. ఈ  భావన మనలో ఎందుకుంది?  మానమసలు ఏం కోల్పోతాం ? ఈ ప్రశ్నలకు, రమణ మహర్షి ఓ కథ ద్వారా మనకు సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. 

ఓ పది మంది మూర్ఖులు,  నిండుగా ప్రవహిస్తున్న వాగును దాటడం మొదలెట్టారు.  అవతలి ఒడ్డుకు చేరుకోగానే వారంతా క్షేమంగా చేరుకున్నారో లేదో చెక్ చెయ్యడం మొదలెట్టారు. ఆ పది మందిలో ఒకరు లెక్క పెట్టడం మొదలెట్టారు.  కానీ లెక్కించే సమయంలో తనను తాను లెక్కించుకోడం మర్చిపోయాడు. ‘అరె తొమ్మిది మాత్రమే ఉన్నాం. ఒకరిని పోగొట్టుకున్నాం. అదెవరై ఉంటారు ?’ అని ఆందోళన పడ్డాడు.  ‘నువ్వు కరెక్ట్ గానే లెక్క పెట్టావా’ అంటూ ఇంకొకరు మళ్ళీ లెక్కించడం మొదలు పెట్టాడు. అదే తప్పు చెయ్యడం వలన అతనికీ తొమ్మిది మాత్రమే ఉన్నామనిపించింది.  ఒకరి తర్వాత ఒకరు ఇలానే  లెక్కించి ‘9 మంది మాత్రమే ఉన్నాం’ అని అందరూ అంగీకరించారు. కానీ మిస్ అయ్యింది ఎవరూ అనేది మటుకు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కనుక్కోలేకపోయారు.  మొత్తానికి ఒకర్ని కోల్పోయారు అనుకుని అందరూ కన్నీళ్లు తెచ్చుకుని ఏడవటం మొదలెట్టారు.  ఆ ఏడుపును విని అటుగా వెళ్తున్న బాటసారి వాళ్ళ బాధకు కారణం అడిగాడు.  మొత్తం కథ విన్న అతనికి ఈ పరమానంద శిష్యుల అజ్ఞానం అర్ధమయ్యింది. వాళ్ళ అజ్ఞానం వాళ్లకే చూపించతలచి బాటసారి వాళ్ళతో ఇలా అన్నాడు. ‘మీరంతా లైన్ లో నిలబడండి. నేను వరుసగా ఒక్కొక్కరి చెంప మీద కొడతాను.  కొట్టించుకున్నవాడు వరుసగా వారి అంకె చెప్పండి.  ఒకటి, రెండు, మూడు,… ఇలా.’ మిస్ అయినా యోధుడెవరో తెలుసుకోవచ్చు అని అందరూ దీనికి ఒప్పుకున్నారు. బాటసారి ఒక్కొక్కరిని కొట్టడం మొదలెట్టాడు. చివరి చెంపదెబ్బ తిన్న తరువాత ‘పది’ అని గట్టిగా అరిచాడు చివరివాడు.  వాళ్లంతా షాక్ అయ్యారు.  ఆశ్చర్యంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు. ‘మనం పది మందిమీ ఉన్నాం’ అని గట్టిగా అరిచారు. వాళ్ళ బాధను తొలగించినందుకు బాటసారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

పదవ వ్యక్తి తప్పిపోయాడా?  తప్పిపోయి మళ్ళీ ఎక్కనుండైనా వచ్చాడా ?  దీన్నుంచి వాళ్ళు దుఃఖంకు కారణం అజ్ఞానమే అని తెలుసుకున్నారా?  మన బాధలు కూడా సరిగ్గా ఇలాంటివే అంటారు రమణులవారు. నెక్స్ట్ పేరాగ్రాఫ్ లో అలా ఎందుకన్నారో వివరించడానికి ప్రయత్నించాను. 

ఈ ఇమేజ్ లో చెప్పినట్టు మనకు జీవితంలో  తెలిసిన కోణాలు శరీరం,  మనసు మాత్రమే అయితే భయం అనివార్యం అంటారు ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్.  ఎందుకంటే మనం వాటిని ఎంత ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నించినా వాటి లిమిట్స్ వాటికుంటాయ్. ఒక్క సెకను లో ఆ రెండు తలకిందులయ్యే ప్రమాదముంది. కాబట్టి శరీరం నశించిపోతున్నా, మనసు చెదిరిపోతున్నా మనం భయపడటం మొదలెడతాం. ఉదాహరణకు కలలో  దేవుడు వచ్చి నీ ప్రాణం నీ మోటర్ సైకిల్ లో ఉంది,  అది బాగుంటేనే నువ్వు బాగుంటావ్ అని చెప్తే మనం ఏం చేస్తాం. బండికి పంక్చర్ అయినా,  హెడ్ లైట్ పగిలినా, ఇండికేటర్ విరిగినా మనకు గుండె నొప్పి వస్తుంది. మోటార్ సైకిల్ కు ఏమైనా నాకేం కాదు అని మీరెప్పుడైతే రియలైజ్ అవుతారో అప్పుడే భయం నుంచి బయటకొస్తారు. అవునా ?  అలాగే శరీరం,  మనస్సు ఏమైనా ‘నేను’ ఏమీ కాను అని రియలైజ్ అయినప్పుడే మనం కోల్పోయేది ఏదీ లేదు అనేది మన అనుభవం లోకు వస్తుంది.  నేను కోల్పోయేది ఏదీ లేదనే నిజం తెలుస్తుంది. ఇందుకే యోగులు నువ్వు శరీరం కాదు,  మనసు కాదు అని చెప్తుంటారు. అలా అని దీనర్ధం ఈ రెండిటిని గాలికొదిలెయ్యమని కాదు. ఈ రెండు కాక నీలో చావు లేనిదీ, చచ్చిపోనిది తెలుసుకుంటేనే మనం భయానికి చెక్ పెట్టొచ్చు.  అంతేకాని భయాన్ని పోగొట్టడానికి 101 టిప్స్ అండ్ ట్రిక్స్ లాంటి పుస్తకాలను నమ్మకండి. 

ఒంట్లో భయం ఉంటేనే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు. భయం ఉంటేనే బతుకు లాంటి డైలాగులు మనం ఇళ్లలో వింటూనే ఉంటాం. ఇందులో వాస్తవం లేదు. మనకు పోయేదేమీ లేదు అనే అభయం తో ఉన్నప్పుడే మన పూర్తి సామర్ధ్యం బయటకొస్తుంది. పూర్తి సామర్ధ్యం తో బతికినప్పుడే జీవితం ఆనందమయం అవుతుంది. ఇది ఒక ఐడియాలజీ కాదు, బోధన కాదు. ఫిలాసఫీ అంతకన్నా కాదు. సృష్టిలో ప్రతీ జీవి, పురుగు నుంచి పక్షి వరకు, అన్నీ వాటి పూర్తి సామర్ధ్యాన్ని ఉపయోగించి జీవితం పరిపూర్ణం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. అంతెందుకండి కొరోనా వైరస్ కూడా తన పూర్తి సామర్ధ్యం మేరకు ఎలా వ్యాపించాలో ప్రయత్నించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇది ప్రకృతి సహజం. కేవలం కోల్పోతామనే భయంతో మనం ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్లదలిస్తే మానవ పుట్టుక వ్యర్థం. అన్నీ పాసిబిలిటీలను మూసి వేసిన వాళ్ళమౌతాం.

అత్యుత్తమ మనిషికి ఏ లక్షణాలు ఉండాలో నాకు తెలియదు కాని, ఏదయినా కోల్పోతామనే భయం మటుకు తనకుండదు. భయం లేని వారి వలన మనం పొందిన లాభాలు వర్ణనాతీతం. ఇలాంటి మనుషులు ఈ గ్రహానికి ఒక వరం.

భయం గురించి ఓషో చెప్పిన కోట్ తో ఈ బ్లాగ్ ముగిద్దాం. నమస్కారం 🙏.

If time allows read my first blog too.

https://premchandnagari.wordpress.com/2020/05/03/xfy/

నా జీవితంలో ఒక మైలురాయి వంటి పుస్తకం…. THE TRUTH ABOUT SPIRITUAL ENLIGHTENMENT

నా మొట్టమెదటి బ్లాగ్ చదువుతున్న మీకు థ్యాంక్స్. ఇది తెలుగు బ్లాగ్ అయినప్పటికీ, ఇంగ్లీష్ మూవీస్ ను తెలుగులో డబ్బింగ్ చేసినపుడు వాడే గ్రాంధిక భాష ను నేను వాడదలుచుకోలేదు. మనం బయట వాడే తెంగ్లీష్ లోనే రాయదలిచాను. ఇది నాకు భాష మీద పట్టులేకో లేక గౌరవం లేకో కాదని అర్దం చేసుకోగలరు. ఇక పోతే నా బ్లాగ్ ఏదయినా మొత్తంగా చదివి ఒక కంక్లూషన్ కు రండి.

ఆనందం…. పుట్టిన దగ్గర నుంచి మనం చేసే ప్రతి పని,  మాట్లాడే ప్రతి మాట,  ప్రతి ఆలోచన,  వీటన్నిటి లక్ష్యం ఒకటే…. ఆనందం.  డబ్బు సంపాదించినా,  స్పోర్ట్స్ లో విజేతగా నిలిచినా,  ప్రేమించి పెళ్లాడిన,  పెళ్లి చేసుకొని ప్రేమించకూడదనుకున్న,  చదువుకున్నా,  చదువు కొన్నా,  మద్యం సేవించినా,  మత్తులో మునిగినా…. ఇవన్నీ చేసేది ఆనందం కోసమే కదా….  అంతెందుకు చివరికి నాకు బాధగా ఉంటేనే ఆనందం అనేవారి లక్ష్యం కూడా ఆనందమే. కాకపోతే చిన్న ప్రాబ్లెమ్…’ దిస్ టూ విల్ లాస్ట్ ‘ అంటూ ఆనందం మనతో శాశ్వతంగా ఉండటంలేదు.  ఏంటేంటెంటి… ఆనందం.. శాశ్వతం.. ఆహాఁ ఆ కాంబినేషనే అదిరిపోయింది కదా…  మరిది కేవలం ఊహేనా ?  ఆనందం మటుకు టెంపరరీ నేనా ?  ఒకవేళ టెంపరరీ అయితే జీవితంలో ఆనంద సమయం శాతం ఎంత?  ఈ శాతం అందరి జనాలకు ఒకేలా ఉంటుందా ?  ఇలాంటి ప్రశ్నలకు జవాబు కోసం నాకు తెలియకుండానే నేను ఆధ్యాత్మిక ప్రయాణం  మొదలెట్టాను. ఈ ప్రయాణంలో నాకు తారస పడ్డ ఒక పుస్తకం గురించి మీతో పంచుకుందాం అన్న ముఖ్య ఉద్దేశ్యంతో ఈ బ్లాగ్ రాయడం జరిగింది.

పుస్తకం పేరు “ది ట్రూత్ అబౌట్ స్పిరిట్యుయల్ ఎన్‌లైట్‌మెంట్ “. రచయిత పేరు పి. షణ్ముగం. మనం పైన చెప్పుకున్న శాశ్వత ఆనందం నువ్వు మన దేశంలో ‘ముక్తి’, ‘మోక్షం’ అని పిలుస్తారు. ఆంగ్లంలో ‘లిబరేషన్’ లేదా ‘ఎన్‌లైట్‌మెంట్’ అంటారు. బుద్ధుడు ‘నిర్వాణ’ అని పిలిచాడు. ఆ స్టేట్ కు చేరుకోవడం ఎలా అని చెప్పే వేదాలు, మతాలు, పురాణాలు, గ్రంధాలు చాలానే ఉన్నాయ్. వీటికి తోడు సైన్స్ కూడా వీటిలోని నిజానిజాలేంత అని తేల్చే పనిలో ఉంది. వీటన్నిటి దారులు వేరైనా వీటి గమ్యం ఒకటే అని చెప్పడం ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.

ఇంట్రో లో రచయిత చేప్పిన మాటలు ఈ పుస్తకం పై మరింత ఆసక్తిని పెంచాయి. “మోక్షానికి అనేక మార్గాలున్నాయి. బుద్ధిజం, అద్వైత వేదాంతం మరియు సైన్స్ కాన్సెప్ట్ లను బేస్ చేసుకుని మీ మార్గాన్ని మీరే తయారు చేసుకోవచ్చు. దీని కోసం మీరు ప్రపంచాన్ని త్యజించక్కర్లేదు. (మరీ పెద్ద మాట వాడానా ? అదేనండి renounce చెయ్యక్కర్లేదు). ఎవ్వరికి సరెండర్ అవ్వాల్సిన పని లేదు. ఏ సంస్థకు వాలంటీర్ అవ్వాల్సిన పని లేదు. ఏ గురువుకో, దేవుడికో పరమ భక్తుడిగా అవ్వనవసరం లేదు. గంటల తరబడి ధ్యానం లో కూర్చోవాల్సిన పని అంతకన్నా లేదు. ధ్యానం కొంత వరకు మీకు సాయపడచ్చు కానీ, మీ దిన చర్యలనే (డైలీ ఆక్టివిటీస్) ఒక ఆధ్యాత్మిక సాధనగా ఎలా చేసుకోవచ్చు అన్న విషయం మీదే ఈ పుస్తకం లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చాను. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు దేన్ని నమ్మవలసిన పని లేదు. మంత్రం, తంత్ర, మాయ, అద్భుత శక్తుల మాటే లేదు. నా అనుభవాన్ని ఆధారంగా చేసుకొని రాసినదే ఈ పుస్తకం.” ముక్తి మార్గం చాలా సింపుల్ కానీ సులభం కాదని, ఈ దారిలో నడవాలంటే చాలా ధైర్యం కావాలని కూడా రచయిత చెప్పడం జరిగింది.

ఈ పుస్తకంలో బేసిక్ థియరీ, ముందుగా మనం సబ్జెక్ట్ మరియు ఆబ్జెక్ట్ ల అర్ధాలు, వాటి మధ్య తేడాలు తెలుసుకోవడం. ఈ తేడా తెలుసుకుంటే మన ప్రయాణం సెమీ స్లీపర్ నుంచి స్లీపర్ కు షిఫ్ట్ అయినట్టే. గమనించగల విషయాలన్నీ (that which can be observed) ఆబ్జెక్ట్ లగాను, ఏదైతే గమనిస్తుందో (which is observing) దానిని సబ్జెక్టు గాను విభజించారు. గమనించగల విషయాల జాబితాలో ఏమొస్తాయో ఒకసారి చూద్దాం. చూసినవి, విన్నవి, వాసన ద్వారా తెలుసుకున్నవి, రుచి చూసినవి, ఇలా బయటవి మాత్రమే కాకుండా మన ఆలోచనలు, ఫీలింగ్స్, సెన్సషన్స్ లాంటి లోపలివి కూడా ఆబ్జెక్ట్ ల జాబితా లోకు వస్తాయి. మరి వీటన్నిటిని గమనించేదేమిటి? అదే ‘ప్యూర్ అవేర్నెస్’. ఇదే సబ్జెక్టు. ఈ సబ్జెక్ట్ ను ‘సెల్ఫ్’ అని పిలుద్దాం. సంస్కృతంలో ‘సాక్షి’ అంటారు. మీకు భక్తి రసం కొంచెం ఎక్కువగా ఉంటే ‘ఆత్మ, పరమాత్మ’ అని కూడా పిలుచుకోవచ్చు.

ఇంతకూ నీ బాదేంట్రా బామ్మర్ది అంటే, ‘నేను’ అనే మనం సబ్జెక్ట్ కిందకొస్తాం. ఆబ్జెక్ట్ కిందకు రాము. అనగా ‘నేను’ అనేది శరీరం కాదు, ఆలోచనలు కాదు, ఫీలింగ్స్, ఎమోషన్స్ కూడా కాదు. అవునండి ఏదయితే గమనించగలమో అది మనమెలా అవుతాం ? ఈ విషయం, మీరు గమనించడం మొదలు పెడితేనీ మీ అనుభవం లోకు వస్తుంది. మీరు కనుక కనీసం పది నిముషాలయిన కంటిన్యూ గా మీ శరీరాన్ని, ఆలోచనలను, వాటి పాటర్న్స్ ను గమనించగలిగితే మీ జీవితంలో ఒక కొత్త తలుపు తెరుచుకుంతుందని నొక్కి మరీ చెప్పారు రచయిత.

రమణ మహర్షి ఈ ‘సబ్జెక్ట్ – ఆబ్జెక్ట్’ కాన్సెప్ట్ ను సినిమా స్క్రీన్ తో పోల్చారు.  సినిమా స్క్రీన్ మీద బొమ్మలు కదులుతూనే ఉంటాయి,  కానీ స్క్రీన్ మటుకు అలానే ఉంటుంది.  మనం కదిలే బొమ్మలను గమనించడంలో నిమగ్నమై ఉంటాము,  స్క్రీన్ ను పూర్తిగా మరిచిపోతాం.  మన ఆలోచనా విధానం కూడా ఇలానే ఉంటుంది.  మనకొచ్చే ఆలోచనలలో మునిగిపోయి, ఆ ఆలోచనలోతోనే గుర్తింపబడతాం.  ఎప్పటికీ ఒక అడుగు వెనక్కేసి ఆలోచనలను గమనించం. 

ఇదే విషయాన్ని సైకోథెరపిస్ట్ మరియు ప్రఖ్యాత ప్రపంచ శ్రేణి ట్రైనర్ తన పుస్తకం ‘యాక్ట్ మేడ్ సింపుల్’ లో విశ్లేషించారు. సైకాలజీ డిపార్ట్మెంటుకు చెందిన స్టీవెన్ సి. హ్యేస్ కూడా ఈ కాన్సెప్ట్ పై స్టడీ చేసి ‘Acceptance and commitment therapy as a unified model of behaviour change’ అనే ఆర్టికల్ రాశారు. వాటి యొక్క ఎక్ససర్ప్ట్స్ మీరు పుస్తకం లో చదవచ్చు.

ఇలా మన శరీరాన్ని, మనసును, ఎమోషన్స్ ను గమనించే పద్దతిని రమణ మహర్షి ‘సెల్ఫ్ ఎంక్వయిరీ’ అంటే ‘ఆత్మ విచారణ’ అని బోధించేవారు. ‘సాక్షి భావ’ అని ఇంకొందరంటారు. జిడ్డు కృష్ణమూర్తి ‘choiceless awareness’ అని పిలుస్తారు. ఆధ్యాత్మిక గురు ఓషో ఈ పద్ధతిని ‘విట్నెస్సింగ్’ గా పిలిచేవారు. ఓషో ప్రకారం, మోక్షప్రాప్తి కోసం శివుడు చెప్పిన 112 సూత్రాలలో కోర్ పార్ట్ గా ‘విట్నెస్సింగ్’ ఉంటుంది.

ఇంతకూ ఈ విట్నెస్ పద్దతిని మన డైలీ లైఫ్ లో అప్లై చేస్తే మనకేం బెనిఫిట్ అంటారా ?

ఆధ్యాత్మిక వేత్తలు ఈ బెనిఫిట్స్ ను అద్భుతంగా వారి పుస్తకాలలో వర్ణించారు. నా వరకు విట్నెస్ చెయ్యడం వల్ల ఏదో తెలియని నిశ్శబ్దం ఆవహించినట్టుంటుంది. ప్రస్తుతం లో బతకడం అంటే ఏంటో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. లైట్ వేస్తే చీకటి తొలిగిపోయినట్టు, విట్నెస్ చేస్తే బాధ, భయం, కోపం… లాంటి నెగటివ్ ఎమోషన్స్ అలా ఆవిరైపోతాయ్. నేనింకా అప్రెంటిస్ కాబట్టి ఇంతకు మించి అనుభవాలు కలగలేదు. ఫ్యూచర్ లో దీనివల్ల కలిగే లాభాలు మరిన్ని మీతో పంచుకుంటాను.

వేదాంతాల సారాంశం మరియు విట్నెస్ చెయ్యడం వల్ల రచయిత రియలైజ్ అయిన అంశాలు ఒక పద్యం రూపంలో చక్కగా రాయడం జరిగింది. ఆ పద్యం అందం చెడగొట్టడం ఇష్టం లేక యధావిధిగా ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తున్నా…

Carrying the weight of past in my head

And dragging the scenes which were old and dead,

I ran to grab the bliss of the future;

The more I ran, the more was the torture..

The torture of the hedonic treadmill

Followed me as I continued uphill;

I was caught in the prison of craving

With tedious thoughts, my mind was raving.

I met an ugly old man on the way

who had a long thick beard with shades of grey.

His face was shining with heavenly bliss;

In his eyes I saw an endless abyss!

“What makes you so happy in this rat race?”,

I asked him as he slowly turned his face.

He replied,”The answer is within you!

The grand kingdom of God is within you!”

“That’s a joke”, I said “Are you kidding me?”.

“No!” He said, “Turn inward, you’ll become free!

You’ve made your own boundaries inside your mind,

You’ve closed your eyes and think you’ve become blind”.

I said, “How can I get out of this trap?

I want to find the way, give me the map”

He said, “You’re the way, the truth and the life!

Be still and know you’re that, and end this strife!

You’re not your body and you’re not your mind;

Not knowing the timeless truth makes you blind;

You’re not your story and you’re not your thoughts;

You’re not those age old, buried mental knots.

You’re not that chattering voice in your head;

You’re not anything that you did or said;

You’re not anything that you have or know

You’re the truth that is watching all this show!

You’re not anything that can be perceived;

You’re not an object that can be observed;

You’re the screen where the world is being played;

You’re the emptiness where the form is made.

You’re the one witnessing the mind and breath;

You’re one without two, beyond birth and death;

Like the air trapped in a small round bubble,

You feel separate which brings all the trouble.

Inquire inside and wake up from this dream!

Let truth alone shine like a bright white beam!

By inquiry, your illusions will break;

You’ll stop mistaking the rope for a snake”

Hearing these words stopped my thoughts for a while.

Looking in, I slowly began to smile.

I watched my thoughts as they slowly passed by;

I observed my mind like a secret spy.

For years, I contemplated on his words;

I watched my thoughts fly like a bunch of birds.

One day, I woke up and realized the truth;

Since then my life has been peaceful and smooth!”

ఇప్పటిదాకా నేను మెన్షన్ చేసినది పుస్తకంలో ప్రధానాంశమే కానీ చాలా బ్రీఫ్ గా చెప్పాను. పూర్తిగా తెలుసుకోడానికి, పుస్తకం లో ఇగ్నోర్ చెయ్యడానికి వీల్లేనటువంటి అంశాలన్నీ,  తెలుసుకోవలసిందే. 

లిబరేషన్ కాన్సెప్ట్ మీద సైంటిఫిక్ గా ఏవైనా పరిశోధనలు జరిగాయా ? సైన్స్ ఆధ్యాత్మికత ను గురించి ఏమంటుంది అనే విషయాలు కూడా ఈ పుస్తకంలో చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఆధ్యాత్మికతను సైంటిఫిక్ టర్మ్స్ లో మాట్లాడుకునే ముందు బ్రెయిన్ గురించి కొంత తెలుసుకోవాలి.  మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ ఒకదానికొకటి ఎలెక్ట్రోకెమికల్ సిగ్నల్స్ ద్వారా సంకేతాలు ఇచ్చి పుచ్చుకుంటాయ్. ఈ సిగ్నల్స్ ను ‘యాక్షన్ పొటెన్షియల్స్’. మన ప్రతీ అనుభవం మన బ్రెయిన్ లో జరిగే న్యూరల్ ఆక్టివిటీ మీదే ఆధారపడుంటాది.

ఒక్కసారి లిబరేట్ అయిన వ్యక్తి ‘నేను’ వేరు ప్రపంచం వేరు అనే భావన నుండి విముక్తి పొందుతాడు. మనకు ఈ భావన కలిగించేది మటుకు మన లెఫ్ట్ బ్రెయిన్. ఈ కేటగరైజేషన్ ను లెఫ్ట్ బ్రెయిన్ ఇంటర్ప్రెటేర్ అని పిలుస్తారు. ఈ ఫీలింగ్ పుట్టినప్పుడు మనకుండదు. జ్ఞానం సంపాదించడం మొదలయ్యాక, రాను రాను మనలో ఈ సపరేట్ అనే ఫీలింగ్ బలోపేతం అవుతుంది. కొత్తగా సేకరించిన ఇన్ఫర్మేషన్ ను గతంతో రిలేట్ చేసి జెనెరలైజ్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంది లెఫ్ట్ బ్రెయిన్ ఇంటర్ప్రెటేర్. ఈ కాన్సెప్ట్ ను స్ప్లిట్ బ్రెయిన్ పేషెంట్స్ మీద జరిపిన ఒక రీసెర్చ్ లో కనుగొన్నారు మైఖేల్ గజానిగా. ఇందుకుగాను 1981 లో ఆయన నోబెల్ బహుమతి కూడా పొందారు.

ఇలా అనేక మంది సైంటిస్ట్స్ ప్రొపోజ్ చేసిన థియరీలను(పుస్తకంలో పూర్తి స్థాయిలో వివరింపబడ్డాయి) బేస్ చేసుకొని మనకు ఒక సైంటిఫిక్  కంక్లూషన్ ఇచ్చారు రచయిత షణ్ముగంగారు.

ముక్తి పొందిన వ్యక్తి నాన్ డ్యూయల్ నేచర్ లో జీవిస్తాడు. ప్రపంచం నుంచి నేను వేరు అనుకునేలా ఒక ఇగోయిక్ సెల్ఫ్ ను నిర్మించుకోడు. నేను అంటే ఏమిటన్నది ఫుల్ క్లారిటీ వస్తుంది. ఉన్నది ఉన్నట్టు చూడలేకపోటానికి కారణం లెఫ్ట్ బ్రెయిన్ ఇంటర్ప్రెటేర్. రియాలిటీ నుంచి మనలను దూరం చేస్తుంది. రకరకాల నమ్మకాలను బేస్ చేసుకొని ఒక సైకాలాజికల్ రియాలిటీ ని సృష్టించి నేను ఫలానా అని గుర్తింపబడేలా చేస్తుంది. ఈ గుర్తింపును కాపాడుకునేందుకు మనం నానా తంటాలు పడే అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. ఈ నకిలీ నేను ని విస్తరించేలా చేసేందుకు మనం జ్ఞానం, ధనం, నమ్మకాలను సంపాదించేందుకు కృషి చేస్తాం. మనమేంటి అనేది తెలుసుకోడానికి మన గతం మీద ఆధారపడేలా చేస్తుంది. ఆ తెలుసుకున్న ‘మనం’ ను ఎన్హాన్స్ చేయ్యడానికి ఫ్యూచర్ మీద ఆధారపడేలా చేస్తుంది. మనమొక ట్రెడ్మిల్ మీద స్టక్ అయ్యేలా ఫీల్ అవ్వడానికి కారణం ఇదే.

ఆధ్యాత్మిక ముక్తి ఈ ట్రెడ్మిల్ బాధను నిర్మూలించగలదు. సృష్టిని మనల్ని ఒక్కటిగా ముడి పెడుతుంది. అంతర్గత కలహాలన్నిటిని తొలగిస్తుంది. లెఫ్ట్ బ్రెయిన్ ఇంకా విషయాలను క్యాటగరైజ్ చెయ్యడానికి ట్రై చేస్తున్నప్పటికీ, అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చెయ్యకుండా చేస్తుంది. సైకాలాజికల్ నేను ని కాపాడుకునే ప్రయత్నాలను ఆపేస్తుంది.

పుస్తకంలో చివరగా రచయిత తన ఆధ్యాత్మిక ప్రయాణంను కూడా రాశారు. ఇది చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది. ఆత్మహత్య వరకు వెళ్లొచ్చి తన జీవితాన్ని ఆనందమయం ఎలా చేసుకున్నాడనే విషయం తెలుసుకోవచ్చు.

చివరగా బుద్ధుడు తన ఆఖరి రోజు అన్న మాటలతో బ్లాగ్ ముగిద్దాం. మీరు చనిపోయిన తరువాత నన్నెవరు గైడ్ చేస్తారని ఒక ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు బుద్ధుడు “అప్పో దీపో భవ” అని సమాధానమిచ్చారట.  అంటే నీ  అంతర్గత వెలుగు సరిపోతుంది. అదే నిన్ను గైడ్ చేస్తుందని అర్దం. 

ప్రతీ వ్యక్తి ఏవేవో వాటి వెంట పడుతున్నట్టు కనిపిస్తుంది కానీ, అంతర్గతంగా మనమంతా ఆశించేది ముక్తి కోసమే. మీకింకా ఇది అనుభవంలోకి రాకపోయుండచ్చు కానీ మీ గుండె లోతుల్లో ఉండే తాపత్రయం ఇదే. ఒక్కసారి మీరిది గుర్తుపట్టగలిగి మీకు ఆధ్యాత్మిక బాట గురించి ఒక బేసిక్ ఐడియా వస్తే మీ లోపలి వెలుగే మిమ్మల్ని గమ్యం చేరుస్తుంది. ముక్తి అనేది బయటెక్కడో ఉండే విషయం కాదు, ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు, ఏ ప్రయాణం అక్కర్లేదు.

మీరు తప్పక చదవాల్సిన పుస్తకాల లిస్ట్ లో ఈ పుస్తకం చేరుస్తారని ఆశిస్తూ… సెలవు తీసుకుంటున్నాను.